
ప్రభుత్వమే చెల్లించాలి
గత ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తే బాగుంటుంది. రైతులు రూపాయి కూడా చెల్లించకుండానే జగన్ ప్రభుత్వం రైతులకు బీమా డబ్బులు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం రైతులపై ప్రీమియం భారం మోపింది. అందుకే చాలామంది రైతుల బీమాకోసం ప్రీమియం చెల్లించలేదు. వారందరికీ బీమా వర్తించదు.
– రైతు ఓబిరెడ్డి, బుచ్చయ్య గారిపల్లి,
బుక్కపట్నం మండలం
ప్రీమియం చెల్లించిన
వారికే బీమా
సకాలంలో ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుంది. మిగిలిన వారికి వర్తించదు. సాధారణంగా బ్యాంకులో క్రాప్‌లోన్ పొంది రెన్యూవల్ చేసుకున్న వారంతా బీమా ప్రీమియం చెల్లించారు. వారందరికీ పంటల బీమా వర్తిస్తుంది. ప్రీమియం చెల్లించని వారికి బీమా వర్తించదు.
– రామునాయక్, జిల్లా వ్యవసాయాధికారి