
దళారుల రాజ్యం.. రైతు నిలువు దోపిడీ
పెద్దపప్పూరు: దళారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తుండడంతో టమాట రైతు నిలువు దోపిడీకి గురయ్యాడు. పంటను మార్కెట్‌కు తరలిస్తే లాభం మాట దేవుడెరుగు... రైతు చేతి నుంచే రూ. వందలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. వివరాలు... పెద్దపప్పూరుకు చెందిన టమాట రైతు షేక్ రఫీ గురువారం 25 కిలోల చొప్పున 31 బాక్సుల టమాటను బొలెరో వాహనంలో నంద్యాల జిల్లా ప్యాపిలిలోని మార్కెట్‌లో విక్రయానికి తీసుకెళ్లాడు. ఇందుకు గాను వాహనానికి రూ.1,500 అద్దె చెల్లించాడు. అక్కడి దళారులు గ్రేడింగ్ చేసి 31 బాక్సులను కాస్త 23 బాక్సులకు కుదించారు. బాక్స్‌కు రూ.70 చొప్పున వేలం పాడడంతో రూ.1,610 వచ్చింది. దళారుల కమీషన్ రూ.160 పోను రూ.1,450 చేతికి అందింది. పంట కోసిన కూలీలకు రూ. 600 రైతు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క రూపాయి ఆదాయం రాకపోగా చేతి నుంచి మరింత ఖర్చు పెట్టాల్సి రావడంతో రైతు ఆవేదనకు అంతులేకుండా పోయింది.
ఆదాయం రాకపోగా
రైతన్నకు చేతి నుంచి రూ.600 ఖర్చు

దళారుల రాజ్యం.. రైతు నిలువు దోపిడీ