ప్రశాంతి నిలయం: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు –2025 పోస్టర్లను గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో అనంతపురంలోని అర్డీటీ స్టేడియం వేదికగా 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడాసాంస్కృతిక ఉత్సవాలు–2025 జరగనున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి 27 యూనిట్లు పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ రామిశెట్టి వెంకటరాజేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, వివిద మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎలుగు బంట్ల దాడిలో రైతుకు గాయాలు
పావగడ: తాలూకాలోని నాగలాపురం గేట్ గ్రామానికి చెందిన రైతు వెంకటేశప్ప పై రెండు ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గురువారం ఉదయం పొలం పనులు చేసుకుంటున్న సమయంలో రెండు ఎలుగుబంట్లు దాడి చేయడంతో వెంకటేశప్ప తల, వెన్ను, తదితర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే క్షతగాత్రుడిని తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి బసవరాజు.. ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు.

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది : కలెక్టర్