
ఆందోళనలు ఉధృతం చేస్తాం
భవన నిర్మాణ రంగ కార్మికులకు ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నమ్మబలికారు. అధికారం చేపట్టిన తర్వాత నేటికీ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఎమ్మెల్యేలు సైతం కార్మికుల సమ్యస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్‌ల, కార్మిక శాఖ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. డిమాండ్ల సాధనకు ఉద్యమాలు ఉధృతం చేస్తాం.
– సాంబశివ, భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి