
బయోమెట్రిక్ విధానం అమలు
ఉపాధి పనుల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువస్తోంది. బిల్లుల పెండింగ్ విషయం వాస్తవమే. అయితే గతంలో రూ.77.47 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, విడతల వారీగా చెల్లిస్తూ వచ్చాం. ప్రస్తుతం రూ.66 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత వారంలో కూలీల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. వచ్చే వారంలో బిల్లులన్నీ మంజూరవుతాయని ఆశిస్తున్నా. ఇప్పటికే అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. అడిగిన వారందరికీ పనులు కల్పిస్తాం.
– విజయ్ ప్రసాద్, పీడీ, డ్వామా