
మోయలేని భారం
పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు కొత్తగా విద్యుత్ మీటర్ కొనలేని పరిస్థితి. ఇప్పటికే కరెంట్ బిల్లులు భారీగా పెంచారు. ప్రతి నెలా కరెంట్ బిల్లలు కట్టేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు మీటర్ల ధరలు పెంచారు. ఇది ప్రజలపై మోయలేని భారం. ఎన్నికల్లో సమయంలో కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పిన కూటమి పెద్దలు ఇలా మాట తప్పడం మంచిది కాదు. – రవినాయక్, పుట్టపర్తి
పునరాలోచించాలి
కరెంట్ బిల్లుల అమాంతంగా పెరిగి పోవడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. దీనికి తోడు మీటర్ల ధరలు రెట్టింపునకు పైగా ప్రభుత్వం పెంచి కొత్తగా ఇల్లు కట్టుకునే వారి నడ్డి విరుస్తోంది. పెంచిన ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలి. లేకపోతే ఉద్యమాలు తప్పవు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ బిల్లల భారం తగ్గించాలి. – గంగాద్రి,
సీపీఎం మండల కార్యదర్శి, పుట్టపర్తి

మోయలేని భారం