
నిరుద్యోగుల సమస్యలపై అర్ధనగ్న నిరసన
పుట్టపర్తి అర్బన్: నిరుద్యోగుల సమస్యలపై ఏఐవైఎఫ్ నాయకులు పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ సమస్యపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు భృతి అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయకపోవడం అన్యాయమన్నారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలన్నారు. వెంటనే మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓ సువర్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకలా రాజా, జిల్లా కార్యదర్శి కమల్‌బాషా, జిల్లా నాయకులు ప్రవీణ్ ఫైరోజ్, జీలాన్‌ఖాన్, గోవర్దన్, ఇమ్రాన్, జిలాన్‌బాషా, కుమార్ తదితరులు పాల్గొన్నారు.