
దోమల నియంత్రణ చర్యలు చేపట్టండి
పుట్టపర్తి అర్బన్: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. దోమల నివారణ కోసం స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు వెంటనే చేపట్టాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితో కలిసి పని చేయాలన్నారు. తాగునీటిలో క్లోరినేషన్ చేయించాలని, ట్యాంకుల్లో నీటి శాంపిళ్లను తీసి పరీక్షించాలని, ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే చేయాలని, దోమల లార్వాల పని పట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ అనుమానిత కేసులకు రక్త పరీక్ష చేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ఓబులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చిలమత్తూరు: ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆమె చిలమత్తూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఓపీ ఎంట్రీలలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గర్భిణులకు వైద్య పరీక్షలను రెగ్యులర్‌గా చేయించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి లావణ్య, ఆయుష్ వైద్యురాలు రోజా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దోమల నియంత్రణ చర్యలు చేపట్టండి