ఏదీ సమాచారం?.. ఇదేం ఘోరం! | - | Sakshi
Sakshi News home page

ఏదీ సమాచారం?.. ఇదేం ఘోరం!

Jun 4 2025 12:29 AM | Updated on Jun 4 2025 12:29 AM

ఏదీ స

ఏదీ సమాచారం?.. ఇదేం ఘోరం!

బదిలీలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ బయటకు

వెల్లడించని విద్యాశాఖ

ఆందోళనలో ఉపాధ్యాయులు

నేడు స్కూల్‌ అసిసెంట్ల

బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు

ఖాళీలు చూపించలేదంటున్న టీచర్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సంబంధించి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పూర్తి గోప్యత పాటిస్తుండడంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ 3–4 సార్లు రాష్ట్ర అధికారులు వెబెక్స్‌లు పెట్టుకుంటూ వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవేవీ క్షేత్రస్థాయిలో ఉండే టీచర్లకు చేరడం లేదు. కనీసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్న గ్రూపుల్లో షేర్‌ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పోనీ మీడియా ద్వారానైనా ఉపాధ్యాయులకు తెలియజేసే ప్రయత్నాలు చేయకపోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాలకు సంబంధించి రోజూ స్వయంగా డీఈఓల పేరుతోనే వివిధ మెసేజ్‌లు టీచర్ల గ్రూపుల్లో వైరల్‌ అవుతున్నాయి తప్ప మన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలు, ఖాళీల విషయం ఏమాత్రం బయటకు చెప్పడం లేదు. రెండు రోజుల కిందట పీఎస్‌హెచ్‌ఎంల బదిలీలయ్యాయి. ఆయా సబ్జెక్టుల్లో మిగులుగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లకు పీఎస్‌హెచ్‌ఎంలుగా మంగళవారం బదిలీలు చేశారు. అయితే ఎంతమంది పీఎస్‌హెచ్‌ఎంలుగా వెళ్లారు...ఏయే సబ్జెక్టుల వారు వెళ్లారు...వీరిలో తప్పనిసరి బదిలీలయ్యేవారు, రెక్వెస్ట్‌ బదిలీలయ్యారు? అనే సమాచారం రాత్రి 10 గంటలు దాటినా బయటకు చెప్పలేదు.

ఖాళీలు చూపించకుండానే వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలట!

స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఖాళీలు ప్రదర్శించకుండానే బుధవారం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని చెబుతున్నారంటూ టీచర్లు వాపోతున్నారు. సీనియార్టీ జాబితా, ఖాళీలు ప్రకటించిన తర్వాత అభ్యంతరాలకు గడువు ఇవ్వడం లేదంటున్నారు. బత్తలపల్లి బాలికల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఇంగ్లీష్‌ టీచరు జనవరిలో రిటైర్డ్‌ అయ్యారు. ఆమె పోస్టు ఖాళీ చూపించలేదు. ఇక్కడ హిందీ ఒక పోస్టు ఖాళీగా ఉంటే రెండు పోస్టులున్నట్లు చూపించారు. ఉన్న ఖాళీలను చూపించకుండా స్కూళ్లు కోరుకుంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ టీచర్లు వాపోతున్నారు.

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

పుట్టపర్తి టౌన్‌: కడపలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి చేపట్టిన అడ్మిషన్లకు ఈ నెల 19తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలి. బాలికలకు 40, బాలురుకు 40 సీట్లు ఉన్నాయి. 8 నుంచి పదేళ్ల వయస్సు కలిగిన బాలబాలికలు అర్హులు. పూర్తి వివరాలకు https://apsportsschool.ap.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

కూటమిలో విభేదాలు బహిర్గతం

అనంతలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌

ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న పోలీసులు

పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు

పోలీసుల అండతో అడ్డుకున్న పల్లె అనుచరులు

అనంతపురం: ఉమ్మడి జిల్లాలో కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తానని బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌ మంగళవారం అనంతపురం నగరంలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అలాగే రుద్రంపేట సర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి బీసీలను పల్లె వంచిస్తున్న తీరుపై చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్‌ హాల్‌ వద్దకు ఆయన చేరుకోగానే పెద్ద సంఖ్యలో పల్లె అనుచరులు అక్కడకు చేరుకుని భయభ్రాంతులకు గురి చేశారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. నడిరోడ్డుపైనే తోపులాట చోటు చేసుకుంది. ప్రెస్‌మీట్‌, రౌండ్‌టేబుల్‌ సమావేశం విరమించుకుని వెళ్లకపోతే దారుణమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందని పల్లె అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతలోనే పల్లె రఘునాథరెడ్డికి మద్దతుగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రెస్‌మీట్‌లు పెట్టడానికి వీల్లేదంటూ ఆదినారాయణయాదవ్‌ను అడ్డుకున్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి భూమిని కబ్జా చేశారని ఆదినారాయణ యాదవ్‌ ఆరోపించారు. అల్లరిమూకలను రెచ్చగొట్టి పదేపదే బీసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సోలార్‌ ప్రాజెక్ట్‌ కోసమని 100 ఎకరాల గిరిజనుల భూమిని ఆదినారాయణ యాదవ్‌ లాక్కొన్నారని పల్లె అనుచరులు ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమిలోని విభేదాలను బయటపెట్టారు.

ఏదీ సమాచారం?.. ఇదేం ఘోరం! 1
1/1

ఏదీ సమాచారం?.. ఇదేం ఘోరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement