వీఎస్‌యూలో పోటీ పరీక్షల కేంద్రం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

వీఎస్‌యూలో పోటీ పరీక్షల కేంద్రం ఏర్పాటు

Oct 7 2025 3:26 AM | Updated on Oct 7 2025 3:26 AM

వీఎస్

వీఎస్‌యూలో పోటీ పరీక్షల కేంద్రం ఏర్పాటు

వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ క్యాంపస్‌లో పోటీ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్‌గా వర్సిటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జె.విజేతను నియమించారు. సోమవారం వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేంద్రం విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సునీత, ప్రిన్సిపల్‌ సీహెచ్‌ విజయ, ఇతర అధ్యాపకులు డాక్టర్‌ విజేతను అభినందించారు.

బంగారు నగల కోసమే హత్య

సమీప బంధువే నిందితుడు

వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీ సమీపంలో జరిగిన హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. వల్లూరు మల్లికార్జున మెడలో ఉన్న బంగారు నగలు కోసమే సమీప బంధువు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంకటాచలం పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. బుజబుజనెల్లూరు పరిధిలోని న్యూకాలనీలో నివాసముంటున్న మల్లికార్జున గత నెల 29 రాత్రి నుంచి కనిపించలేదు. 30 తేదీన నక్కల కాలనీ సమీపంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. న్యూకాలనీలోనే మల్లికార్జున సోదరుడి కుమార్తె భర్త వెలగల పవన్‌ కల్యాణ్‌ ఉంటున్నాడు. అతను మల్లికార్జునను నగదు అడగ్గా ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్నాడు. కొంతసేపటి తర్వాత తన వెంట మల్లికార్జునను తీసుకెళ్లి మద్యం తాగించాడు. అనంతరం పక్కా ప్రణాళికతో హత్య చేసి అతని మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాక్కొని పరారయ్యాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరచగా, ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు.

యువకుడి మృతదేహం లభ్యం

నెల్లూరు సిటీ: పెన్నానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం నలుగురు యువకులు రూరల్‌ పరిధిలోని జొన్నవాడకు సమీపంలో పెన్నానదిలో ఈతకు వెళ్లిన విషయం తెలిసిందే. గణేశన్‌ నరసింహ అనే యువకుడు చనిపోగా మృతదేహం లభ్యమైంది. దేవరపాళేనికి చెందిన కోటయ్య (24) గల్లంతవగా పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించారు. సోమవారం ఉదయం అతని మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరు రూరల్‌: ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో 2025 స్వచ్ఛత అవార్డుల ప్రదానోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములైతేనే పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల కృషితోనే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయన్నారు. నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురేష్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కమిషనర్‌ నందన్‌, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ బాలాజీరావు, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

వీఎస్‌యూలో పోటీ పరీక్షల  కేంద్రం ఏర్పాటు1
1/2

వీఎస్‌యూలో పోటీ పరీక్షల కేంద్రం ఏర్పాటు

వీఎస్‌యూలో పోటీ పరీక్షల  కేంద్రం ఏర్పాటు2
2/2

వీఎస్‌యూలో పోటీ పరీక్షల కేంద్రం ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement