
షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం
● రూ.ఐదు లక్షల నష్టం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధమైన ఘటన మండలంలోని మినగల్లు బీసీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న రామయ్య, లక్ష్మమ్మ దంపతులు మెషీన్‌తో కర్పూరాన్ని తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో షాపులో అర్ధరాత్రి వేళ మంటలు వ్యాపించడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు విషయాన్ని బాధితులకు తెలియజేశారు. అక్కడికెళ్లేలోపు మెషీన్‌తో పాటు గది మొత్తం పూర్తిగా కాలిపోయింది. రూ.ఐదు లక్షల నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మతిస్థిమితం లేక
కాలువలో దూకి..
కలువాయి(సైదాపురం): తెలుగుగంగ కాలువలో దూకి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పర్లకొండ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. చింతలాత్మకూరుకు చెందిన నాగిళ్ల రవి (30) తెలుగు గంగ కాలువలో దూకారు. దాచూరు సమీపంలోని కండలేరులో మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి ఎస్సై కోటయ్య చేరుకొని విచారణ చేపట్టారు. నాగిళ్ల రవికి మతిస్థిమితం సక్రమంగా లేదని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు.
చిన్నారిని అక్కున చేర్చుకొని..
నెల్లూరు(పొగతోట): నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఎనిమిదేళ్ల బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లిపోయారు. విషయాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, బాలల సంరక్షణాధికారి సురేష్ అక్కున చేర్చుకున్నారు. చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు కాప్ చిల్డ్రన్స్ హోమ్‌లో చేర్పించారు. పూర్తి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిస్తే అప్పగిస్తామని, వివరాలు తెలిసిన వారు 90007 89793 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరులో శనివారం నాటికి 58.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు 3600 క్యూసెక్కుల నీరు చేరుతోందని వివరించారు. కండలేరు నుంచి సత్యసాయిగంగకు 430, పిన్నేరుకు 140, లోలెవల్‌కు 40, హైలెవల్‌కు 30, మొదటి బ్రాంచ్ కాలువలకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని చెప్పారు.
పొదలకూరు
నిమ్మ ధరలు
పెద్దవి: రూ.40
సన్నవి: రూ.25
పండ్లు: రూ.15

షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం