
ట్రాలీ తెచ్చిన తంటా
● వంతెనపై ఇరుక్కున్న లారీ
● రెండు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
దగదర్తి: భారీ లోడుతో వెళ్తున్న ట్రాలీ ఇరుక్కుపోయి ముందుకు కదల్లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ దాదాపు రెండు గంటల పాటు స్తంభించింది. మండలంలోని అల్లూరు రోడ్డు వద్ద జాతీయ రహదారి రైల్వే వంతెనపై శనివారం జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. వివరాలు.. రైల్వే వంతెనపై రోడ్డు రెండు వరుసలే ఉంటుంది. ఈ క్రమంలో కావలి నుంచి నెల్లూరువైపు భారీ లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ రైల్వే వంతెనపైకి రాగానే మధ్యలో ఇరుక్కుపోయి ముందుకు కదల్లేదు. దీంతో వాహనాన్ని డ్రైవర్ నిలిపేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది.. మార్జిన్ రాళ్లను తొలగించి ట్రాలీ ముందుకెళ్లేలా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి ఆరు వరుసలకు గానూ ఇక్కడ రెండే ఉండటంతో ఈ పరిస్థితి నిత్యకృత్యమవుతోంది.

ట్రాలీ తెచ్చిన తంటా