
బాధ్యతాయుతంగా సబ్‌స్టేషన్ల నిర్వహణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సబ్‌స్టేషన్లను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య ఆదేశించారు. నగరంలోని 33 / 11 కేవీ వైఎమ్సీఏ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. సాంకేతిక విధివిధానాలు, రికార్డుల నిర్వహణ, ఫీడర్లలో లోడ్ తదితరాలను పర్యవేక్షించారు. ఎల్సీ, లాగ్‌బుక్, ఫీడర్ రీడింగ్ రిజిస్టర్లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. నోడల్ ఆీఫీసర్ శేషాద్రిబాలచంద్ర, ఈఈ లక్ష్మీనారాయణ, డీఈఈలు కిరణ్, సుప్రియ, ఏఈలు లక్ష్మీబాయి, లక్ష్మి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.