
న్యాయం చేయాలని వినతి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న గీతాంజలి మృతిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సీఐ రోశయ్యకు వినతిపత్రం అందజేశారు. వైద్య విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, ఆత్మస్థైర్యం పెంపొందించేలా మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు ఎండీ తౌఫిక్, రూరల్ అధ్యక్షుడు రోహిత్, నాయకులు చంద్ర, శరత్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్: రూ.133
లేయర్ రూ.110
బ్రాయిలర్ చికెన్: రూ.238
స్కిన్‌లెస్ చికెన్: రూ.262
లేయర్ చికెన్: రూ.187