
తెలుగుదేశం అడ్రస్ గల్లంతు ఖాయం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మనుబోలు మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ వీరాభిమాని, విశ్రాంత ఉపాధ్యాయుడు బాలిరెడ్డి, పిడూరుపాళేనికి చెందిన నాయకుడు గోపిరెడ్డిను సోమవారం ఆయన పరామర్శించారు. ఇటీవల బద్దెవోలు గ్రామానికి చెందిన చల్లా రమణయ్య మరణించగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఆయా గ్రామాలకు చెందిన అభిమానులు, నాయకులు కాకాణికి ఘన స్వాగతం పలికారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అరకొరగా అమలు చేసి అంతా చేసేశానంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలను పెంచబోనని హామీ ఇచ్చి తొలి ఏడాదిలోనే రూ.19 వేల కోట్ల భారం మోపడంతోపాటు రూ.923 కోట్లు అక్రమంగా ప్రజల నుంచి వసూలు చేశాడన్నారు. ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఇచ్చే మనసు బాబుకు రాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వల్లూరు హర్షవర్ధన్‌రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, చేడిమాల బుజ్జిరెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ముంగర రవీందర్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, వెంకటశేషయ్య, జానకిరామిరెడ్డి, రమేష్, గిరి, దయాకర్, నవకోటి తదితరులు పాల్గొన్నారు.