
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పలు అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలు పదేపదే వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు తాగునీరు, భోజన వసతి కల్పించడం, అదనంగా పందిళ్లు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబందించి ఈ – ఆఫీసులో ఫైళ్లను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపాలని సూచించారు. ప్రతి ఫైలుకు ప్రత్యేక క్రమ సంఖ్యను కేటాయించి ఆ నంబర్ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు.
● జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రూపొందించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్‌కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.