
మహిళల ఆరోగ్యానికి పెద్దపీట
నెల్లూరు రూరల్: దేశ మహిళల ఆరోగ్య భద్రత కోసం స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రధాని మోదీ ఏర్పాటు చేశారని డీపీఎం రమేష్ పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్‌నగర్‌లో గల పీహెచ్‌సీలో వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేన్సర్, మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులను త్వరితగతిన గుర్తించి.. నివారించేందుకు వీలవుతుందని చెప్పారు. యూపీహెచ్‌సీ వైద్యాధికారి ఇమ్రాన్‌ఖాన్, నెల్లూరు అర్బన్ సీడీపీఓ అరుణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కొండాపురం వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ స్వరూప, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.