
మహిళల జీవనోపాధిని మెరుగుపర్చాలి
● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి
నెల్లూరు(పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలకు జీవనోపాధులను మెరుగుపర్చేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో పశుసంవర్థక శాఖ అధికారులు, ఏపీఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వయం సహాయక మహిళలకు ఏటా వందల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేస్తున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 47,890 యూనిట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాడి పశువులు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు, బీమా, టీకాలు తదితర అంశాలపై గ్రామీణ ప్రాంతాల మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని పేర్కొన్నా రు. అనంతరం పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రమేష్‌నాయక్ మాట్లాడారు. జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపడతామని వివరించారు.