
పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఫారం – 6లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. వీటిని సంపూర్ణంగా పూర్తి చేసేలా నూతన ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. డీఆర్వో విజయ్‌కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.