
తొలిసారిగా రాక్ ఫాస్పేట్ రవాణా
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్న ం పోర్టు లిమిటెడ్ రెండు మైలురాళ్లను నెలకొ ల్పినట్టు పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ గురువారం తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కోసం 1,84,649 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఎంవీ యూరిబియా నౌక బెర్త్ నంబర్ 5 వద్ద ఈనెల 22న 24 గంటల్లో 61,500 మెట్రిక్ టన్నుల అత్యధిక డిశ్చార్జ్ రేట్‌ను సాధించినట్టు వెల్లడించారు. తొలిసారిగా రాక్ ఫాస్పెట్‌ను విజయవంతంగా రవాణా చేసినట్టు తెలిపారు. బ్లూ ఫాస్పెట్ లిమిటెడ్ కడప జిల్లాలోని తన ప్లాంట్ కోసం ఎంవీ గ్లామర్ నౌకలో 13,100 మెట్రిక్ టన్నులను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. భవిష్యత్‌లో రాక్ ఫాస్పేట్‌ను తమ పోర్టు ద్వారా రవాణా చేయనున్నట్టు చెప్పారు. అదానీ కృష్ణపట్నం పోర్టు మార్కెటింగ్ బృందం సాధించిన విజయంగా సీఈఓ చెప్పుకొచ్చారు.
ఆర్థికంగా దెబ్బతిని..
● వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఆర్థికంగా చితికిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. వనంతోపులో నివాసముంటున్న రవికుమార్‌రెడ్డి (40)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను ఓ కంపెనీకి చెందిన ఫ్యాన్లు, కూలర్ల డిస్ట్రిబ్యూటర్. వ్యాపారంలో నష్టాలు రావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఇంటి వద్దనే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 23వ తేదీ రాత్రి మద్యంలో గడ్డిమందు కలిపి తాగాడు. అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గురించి వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు అతడిని బుధవారం తెల్లవారుజామున జీజీహెచ్‌లో చేర్పించారు. రవికుమార్‌రెడ్డి అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య నిర్మల గురువారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.