
రైతు సమస్యలపై సోమిరెడ్డికి శ్రద్ధ లేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: ఇరిగేషన్‌లో దొంగ బిల్లులు చేసుకోవడంపై సోమిరెడ్డికి ఉన్న శ్రద్ధ, రైతుల సమస్యలపై లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని కురిచెర్లపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి అసెంబ్లీ వేదికగా నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న చంద్రమోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి రైతుల సమస్యలను వివరించి గిట్టుబాటు ధర కల్పించకుండా అసెంబ్లీలో మొక్కుబడిగా మాట్లాడి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటన్నారు. ఇరిగేషన్ దొంగ బిల్లుల కోసం అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన వ్యక్తి, రైతుల గిట్టుబాటు ధర గురించి ఎందుకు గట్టిగా అడగడం లేదని ప్రశ్నించారు. పనులు చేయకుండా దొంగ బిల్లులు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న సోమిరెడ్డితోపాటు ఇరిగేషన్ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇసుక, గ్రావెల్, మట్టి, బూడిదను దోపిడీ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని చంద్రమోహన్‌రెడ్డి అమ్మకానికి పెట్టాడని ఆరోపించారు.