
పంచాయతీల ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు
● జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీలు ఆర్థిక ప్రగతి సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. బుధవారం నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీలు స్థానిక పాలనలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఆదాయవనరుల్లేక అనేక పంచాయతీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. కేంద్రం విడుదల చేసే నిధులపై ఆధారపడకుండా సొంతగా ఆదాయవనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. నిధుల కోసం ఎదురు చూడకుండా అవసరమైన సమయంలో సొంత నగదును ఖర్చు చేసుకునే స్థాయికి గ్రామ పంచాయతీలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, మాస్టర్ ట్రెయినర్లు పాల్గొన్నారు.