
మోటార్‌బైక్ దొంగల అరెస్ట్
● రూ.9 లక్షల విలువైన
10 వాహనాల స్వాధీనం
కోవూరు: కోవూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో వరుసగా జరిగిన మోటార్‌బైక్ దొంగతనాల కేసులో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ హైవేపై స్టంట్స్ చేస్తూ పట్టుబడిన కావలి యువకుడు సాగర్ విచారణలో వివరాలు వెల్లడించడంతో ముఠాను పట్టుకున్నట్లుగా నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. కోవూరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. సాగర్‌ను విచారించగా తన స్నేహితులు సుహాన్‌బాబు, ఆదర్శ గోవింద్‌తో కలిసి బైకులను చోరీ చేస్తున్నట్లు వెల్లడించాడు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.9 లక్షల విలువైన 10 బైక్‌లను స్వాధీ నం చేసుకున్నారు. ఇవి ఎక్కువ భాగం కోవూరు, కావలి ప్రాంతాల్లో చోరీ చేసినవే. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు.