
టీడీపీ నేతకు వైఎస్సార్‌సీపీ నేత ఆర్థిక సాయం
నెల్లూరు సిటీ: నగరంలోని 13వ డివిజన్‌కు చెందిన టీడీపీ నేత, నారా లోకేశ్ సేవా సమితి అధ్యక్షుడు కంచి మల్లికార్జునరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న 13వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆర్థిక సాయం చేశారు. రూ.25 వేలు అందించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న మల్లికార్జున్‌రెడ్డి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఆపద సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదని, మానవత్వంతో స్పందించి తమవంతు సహాయంగా అండగా నిలిచామన్నారు.