
ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈగా రాఘవేంద్రం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈగా జిల్లాకు చెందిన కొండూరు రాఘవేంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు విద్యుత్ భవన్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలను బుధవారం చేపట్టారు. సత్యసాయి జిల్లాలో ఈఈగా పనిచేస్తున్న ఈయన ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎస్‌ఈగా పనిచేసిన విజయన్.. తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో జీఎం (సోలార్ కార్పొరేషన్)గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రం మాట్లాడారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను అందిస్తామని వివరించారు. కాగా ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు.
వెంకటాచలం సర్పంచ్ చెక్ పవర్ రద్దు
నెల్లూరు(పొగతోట): నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై వెంకటాచలం సర్పంచ్ రాజేశ్వరి చెక్ పవర్‌ను ఆర్నెల్ల పాటు రద్దు చేస్తూ ఉత్తర్వులను డీపీఓ శ్రీధర్‌రెడ్డి బుధవారం జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై కావలి డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపి నివేదికలను సమర్పించారని వివరించారు. సర్పంచ్ సమర్పించిన సంజాయషీ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.