
ప్రసన్నకుమార్‌రెడ్డి పరామర్శ
ఇందుకూరుపేట: ఇటీవల సంగం మండలంలో పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లగుండ్ల శ్రీనివాసులు, లక్ష్మి మృతిచెందిన విషయం తెలిసిందే. వారి పిల్లలు చందుప్రియ, విశ్వంత్, ఇంకా బంధువులను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన ఇందుకూరుపేటలోని దళితవాడలో ఉన్న వారి నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, డీఎల్‌డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ గుణుపాటి సురేష్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, నాయకులు గురజాల బుజ్జిబాబు, భాను చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.