
విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధిత అధికారులు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. క్రమం తప్పకుండా కంటి, దంత వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేయించాలని, కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి మల్లికార్జునరెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల శాఖ అఽధికారులు పాల్గొన్నారు.