
వీరి చలపతికి జ్యుడీషియల్ రిమాండ్
నెల్లూరు (లీగల్): అక్రమ కేసులో నిందితులుగా ఉన్న డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతితోపాటు బొచ్చు దాసు, అనపల్లి ఉదయభాస్కర్, వీరి సురేష్, పానేటి శ్రీకాంత్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కొడవలూరు మండలం రాజుపాళెంకు చెందిన కరకటి మల్లికార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో నమోదు చేశారు. ఆదివారం నెల్లూరులోని ఇన్‌చార్జి కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. పోలీసుల తరఫున ఏపీపీలు లీలావతి, సుకన్య వాదనలు వినిపించారు. చలపతిరావు తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి. ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, 2023లో ఫిర్యాదు ఇచ్చాడని, అయితే 20.09.2025లో పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తే ఇది పూర్తిగా రాజకీయ కక్షతో బనాయించారంటూ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో 120(బీ) ఐపీసీని తొలగించి ఐదుగురికి అక్టోబర్ 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఉత్తర్వులిచ్చారు.