
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
● ప్రైవేట్ పాఠశాల, ఇతర స్థలాలకు తరలింపు
● సెలవు దినాల్లో రెచ్చిపోతున్న మాఫియా
కలిగిరి: మండలంలోని నాగిరెడ్డిపాళెం చెరువు, వాగు నుంచి గ్రావెల్ తవ్వకాలను జోరుగా ఆదివారం చేపట్టారు. సెలవు దినం కావడంతో మాఫియా రెచ్చిపోయింది. తవ్వకాలు జరుపుతున్న సమయంలో సంబంఽధిత అధికారులకు సమాచారమివ్వడంలేదు. కొందరి అండ చూసుకొని తమ పనిని కానిచ్చి జేబులు నింపుకొంటున్నారు. నాగిరెడ్డిపాళెం నుంచి కలిగిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాల, ఇతర స్థలాలకు జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని భారీగా తరలించారు. మీడియా ద్వారా విషయం బయటకు పొక్కడంతో పోలీసులు, ఇరిగేషన్ అధికారులు నిలిపేయించారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ శ్రీనాథ్ మాట్లాడారు. చెరువు, వాగు నుంచి మట్టిని తరలించిన వారిపై కేసును సోమవారం పెడతామని చెప్పారు. సూత్రధారులు, వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కాగా ఎలాంటి అనుమతుల్లేకుండా జాతీయ రహదారిపై ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారంటే మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. సెలవు దినాల్లో అధికారులు స్థానికంగా ఉండకపోవడాన్ని అదునుగా భావించి తమ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు.

యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు