
నూతన జేసీగా వెంకటేశ్వర్లు
నెల్లూరు(అర్బన్): నూతన జేసీగా మొగిలి వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం జారీ చేసింది. ఇప్పటి వరకు పనిచేస్తున్న కొల్లాబత్తుల కార్తీక్‌ను బదిలీ చేసింది. 13 నెలల పాటు జిల్లాలో పనిచేసిన ఆయన పాలనలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఆయనకు ఇంకా ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు సెలవులో ఉండి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వెంకటేశ్వర్లు జేసీగా నియమితులయ్యారు. 2014 – 15లో బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్‌గా, రాష్ట్ర సచివాలయ అధికారిగా, కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఈయన పనిచేశారు.

నూతన జేసీగా వెంకటేశ్వర్లు