
కూటమి వైఫల్యాలను ఎండగట్టాలి
● వైఎస్సార్‌సీపీ నేతలతో
ప్రసన్న ఆత్మీయ సమావేశం
కొడవలూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నార్తురాజుపాళెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావుతో కలిసి ఆయన పార్టీ నేతలతో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధి విధానాలు, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బట్టేపాటి నరేంద్రరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్‌లు బి.సుప్రియ, ఎన్.కామాక్షి, ఎం.రంగారెడ్డి, నాయకులు ఎ.మోహనకృష్ణ, కొట్టే మల్లికార్జున, పి.సుభాష్‌రెడ్డి, బాలశంకర్‌రెడ్డి, ఎం.మల్లికార్జున, కె.మోహన్‌రావు, జి.జనార్ధన్‌రెడ్డి, బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.