
సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): సెల్‌ఫోన్ చోరీ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో ఓ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు లక్ష్మీపురంలో సురేంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆయన శుక్రవారం తన భార్యను బసెక్కించేందుకు ఆత్మకూరు బస్టాండ్‌కు వచ్చారు. ఈ క్రమంలో అతని జేబులోని రూ.40 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని దుండగులు అపహరించుకుని వెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నవాబుపేట ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి సాంకేతికత ఆధారంగా శనివారం నిందితులు అనకాపల్లి పట్టణానికి చెందిన బి.సతీష్, మరో పదిహేనేళ్ల బాలుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ను అరెస్ట్ చేయగా, బాలుడిని తిరుపతిలోని జువైనల్ హోమ్‌కు తరలించారు.