
శాస్త్రోక్తంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ, ఉదయం శ్రీవారి కల్యాణం నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలోకి తీసుకొచ్చి తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్‌సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నిత్యకల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు.