విజయం.. భవ్యం | - | Sakshi
Sakshi News home page

విజయం.. భవ్యం

Oct 8 2025 8:15 AM | Updated on Oct 8 2025 8:15 AM

విజయం.. భవ్యం

విజయం.. భవ్యం

● వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే.. మా అమ్మ ఐసీడీఎస్‌ (అంగన్‌ వాడీ సూపర్‌వైజర్‌)లో పని చేస్తున్నారు. చిన్నప్పుడు అమ్మతో పాటు సమావేశాలకు వెళ్లాను. మీటింగ్‌లలో చెప్పే విషయాలను విన్నాను. అప్పుడే ఉన్నత లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఐఏఎస్‌ సాధించి మంచి అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయాలని నిర్ణయించుకున్నా. అలా ఐఏఎస్‌ సాధించాలని బీజం పడింది. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేశాను. బీటెక్‌తో ప్లేస్‌మెంట్‌ల వైపు వెళ్లకుండా ఐఏఎస్‌ కావాలని నా డ్రీమ్‌ వైపు ముందుకు సాగాను. 2024లో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ రాశాను. క్వాలిఫై కాలేదు. ప్రిపేర్‌ అవుతున్న క్రమంలోనే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వచ్చింది. ఎలాగు సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండటంతో తెలంగాణ భౌగోళిక శాస్త్రం ఒక్కటి అదనంగా చదివితే సరిపోతుందని గ్రూప్‌–1కు దరఖాస్తు చేశాను. మొదటి ప్రయత్నంలోనే 900 మార్కులకు గాను 521 మార్కులతో రాష్ట్ర స్తాయిలో 9వ ర్యాంక్‌ సాధించాను. ● ఏడాదిన్నర పాటు చదివా.. ● అమ్మానాన్నల ప్రోత్సాహం

చిన్నప్పటి నుంచే ఐఏఎస్‌ కావాలన్నది కోరిక సివిల్స్‌కు క్వాలిఫై కాలేకపోయా.. అదే సమయంలో గ్రూప్‌–1కు అప్లై చేసి చదివా.. 9వ ర్యాంక్‌ సాధించా ‘సాక్షి’తో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ కుడికాల భవ్య

సాక్షి, సిద్దిపేట: ‘చిన్నప్పటి నుంచే ఐఏఎస్‌ కావాలన్నది లక్ష్యం.. 2024లో సివిల్స్‌లో క్వాలిఫై కాలేకపోయా.. అదే సమయంలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో దరఖాస్తు చేశా.. రోజుకు 10గంటలు పట్టుదలతో చదివి 9వ ర్యాంక్‌ సాధించా’ అని సిద్దిపేట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ కుడికాల భవ్య అన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకుని సిద్దిపేటకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం భవ్యను ‘సాక్షి’ పలకరించింది.

సివిల్స్‌ కోసం హైదరాబాద్‌లో ఉదయం వేళ కోచింగ్‌కు, తర్వాత 10 గంటల పాటు చదివాను. అలా ఏడాదిన్నర పాటు ప్రిపేర్‌ అయ్యాను. కోచింగ్‌ అనేది 50శాతమే ఉపయోగపడుతుంది. మిగతాది కోచింగ్‌ సెంటర్‌లో చెప్పిన అంశాలను ప్రిపేర్‌ కావాలి. గ్రూప్‌–1 నోటిపికేషన్‌ రాగానే మూడు నెలల పాటు రోజూ 10 గంటల పాటు ప్రిపేర్‌ అయ్యాను. వారంలో ఆరు రోజులు ఒక సబ్జెక్ట్‌ చొప్పున చదివాను. నేను చదివిన దానిలో నుంచి ప్రశ్నలు తయారు చేసుకుని వాటిని జవాబులు రాయడం చేశాను. ఇలా చేయడంతో మనం ప్రిపేర్‌ అయిన దానికి ఎంత రాయగలుగుతున్నామో అర్థమవుతుంది.

మాది వరంగల్‌ జిల్లా ఏకశిలానగర్‌. మా నాన్న పేరు కుడికాల వెంకటేశ్వర్లు. అమ్మ పేరు చాయా. మా అమ్మానాన్న, అక్క ప్రోత్సాహంతో గ్రూప్‌–1 సాధించాను. డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌ పూర్తి అయ్యాక.. పూర్తి స్థాయిలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతాను. ప్రతీ రికార్డు డిజిటలైజేషన్‌ ముఖ్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలు, పాలసీలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి.

ఏ అంశాలు ఉంటాయో

తెలుసుకోవాలి

సివిల్స్‌ అయినా.. గ్రూప్స్‌, బ్యాంక్‌ పరీక్షలు ఏవైనా ఏ అంశాలు ఉంటాయో ముందుగా ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన బుక్స్‌ తెచ్చుకుని చదవాలి. అలాగే ఒక మెంటర్‌, గైడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చదవడం పోటీ పరీక్షల్లో ఒక వంతు అయితే, దానిని రాయడం మరో ఎత్తు. అందుకోసం ముందు నుంచే ప్రాక్టీస్‌ చేయాలి. అలాగే స్మార్ట్‌గా వర్క్‌ చేయాలి. చాట్‌ జీపీటీ, ఏఐ ఇలా వాటిని ఉపయోగించి స్టడీస్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. కొంత మంది పరీక్షల్లో మంచి ర్యాంక్‌ రాకపోతే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వారు ఎమోషనల్‌గా పరీక్షను చూస్తారు. అలా చూడటం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కటే జీవితం కాదు. ఒక పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు.

పట్టుబట్టి.. ఉన్నత కొలువు కొట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement