
పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే
● ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ ● మంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం ● అడ్డుకున్న పోలీసులు
హుస్నాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంజం వెంకట్‌స్వామి మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ చాలా సున్నితమైన, విశాలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. అలాంటి నాయకుడని పరుష పదజాలంతో ధూషించడం పొన్నం దూకుడు స్వభావానికి తార్కాణమని అన్నారు.