మెరుగైన సేవలే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి

Oct 7 2025 4:56 AM | Updated on Oct 7 2025 4:56 AM

మెరుగ

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి

● నూతన సీపీ విజయ్‌కుమార్‌ ● బాధ్యతల స్వీకరణ కలెక్టర్‌ హైమావతి

జిల్లా విద్యా శాఖ క్వాలిటీ సెల్‌ కోఆర్డినేటర్‌ రమేశ్‌

● నూతన సీపీ విజయ్‌కుమార్‌ ● బాధ్యతల స్వీకరణ

సిద్దిపేటకమాన్‌: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలే లక్ష్యంగా సేవలు అందించాలని నూతన పోలీస్‌ కమిషనర్‌గా విజయ్‌కుమార్‌ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్‌ కార్యాలయంలో పోలీసు అధికారులు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి, పోలీసు అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి టీం వర్క్‌ చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

వైద్యం వివరాలు నమోదు చేయండి

కొండపాక(గజ్వేల్‌): రోజువారీ వైద్యం అందించే వివరాలను, మందుల స్టాక్‌ను రిజిస్టరులో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్‌ హైమావతి ఆదేశించారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌, పరీక్షల తీరును, మందుల స్టాక్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో రాపిడ్‌ టెస్టులను తప్పనిసరిగా చేయాలన్నారు. టెస్టుల వివరాలను రిజిస్టరులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రహదారి వెంట ఉండే ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 108 అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓకు ఫోన్‌ ద్వారా సూచించారు. కార్యక్రమంలో వైద్యులు ఫర్విన్‌, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి దయ అందరిపై ఉండాలి

ప్రశాంత్‌ నగర్‌ (సిద్దిపేట): అమ్మవారి దయవల్ల అందరం క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌లో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రస్తుతం రహదారులు తదితర అభివృద్ధి పనులన్నీ పడకేశాయని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్టు, న్యూట్రిషన్‌ కిట్టు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలన్నీ విస్మరించారని అన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మానవ అక్రమ రవాణాను అరికడదాం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మానవ అక్రమ రవా ణా నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ సెల్‌ కోఆర్డినేటర్‌ ముండ్రాతి రమేశ్‌ అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరై న రమేష్‌ మాట్లాడుతూ మానవ అక్రమ రవా ణా.. అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా మోసపోతున్నారన్నారు. ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ వారికి అవగా హనా కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పజ్వల స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ సురేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ మిథాలి రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన సీపీ

సిద్దిపేటకమాన్‌: నూతన పోలీస్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ సోమవారం కలెక్టర్‌ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ను కలిసి మొక్కను అందజేశారు.

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి 1
1/3

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి 2
2/3

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి 3
3/3

మెరుగైన సేవలే లక్ష్యం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement