ఎన్నికలకు సిద్ధం కండి
బీజేపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్
గజ్వేల్‌రూరల్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎన్‌వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అధ్యక్షతన సోమవారం నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, స్థానిక సంస్థలలో పోటీచేసే ఆశావహులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శ్రేణులంతా ఐక్యంగా కృషిచేయాలన్నారు. అధిష్టానం ఎవరిని సూచించినా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


