
సీజేఐపై దాడి హేయమైన చర్య
గజ్వేల్: సీజేఐపై దాడి చేయడం హేయమైన చర్య అని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం సాయంత్రం గజ్వేల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ సంఘటనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పొన్నాల కుమార్, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు పోశయ్య, భిక్షపతి పాల్గొన్నారు.
వైన్‌షాపులకు 9 దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: జిల్లాలోని వైన్ షాప్‌ల నిర్వహణ (2025–27)కు ఇప్పటి వరకు తొమ్మిది దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్ షాపుల నిర్వహణకు సోమవారం రోజే 8 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో హుస్నాబాద్ పరిధిలో 6, చేర్యాల పరిధిలో 1, సిద్దిపేట పరిధిలో 2 దరఖాస్తులు వచ్చాయని వారు వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
పారదర్శకత,
జవాబుదారీతనం ఉండాలి
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. సమాచార హక్కుచట్టం వచ్చి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 5 నుంచి 12వరకు జరుగుతున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సోమవారం డీబీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ(ఏటిగడ్డ కిష్టాపూర్)లో ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉంటాడన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వాల పనితీరులో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. అలాగే సులభంగా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల అవినీతిని అరికట్టేందుకు ముఖ్య సాధనమన్నారు. లిఖితపూర్వకంగా సమాచారాన్ని కోరుతూ పౌరులు అభ్యర్థన చేయాలని, సాధారణ సమాచారాన్ని 30రోజుల్లో, అత్యవసర సందర్భాల్లో 48గంటల్లోగా అందించాల్సి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌరులు రాజునాయక్, కుమార్, మల్లయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
మందుబాబులకు జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజ రుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి సోమవారం రూ.18,400 జరిమానా, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
గొర్రెలకు టీకాలు
దుబ్బాకరూరల్: మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో కొన్ని రోజులుగా వింత వ్యాధి సోకి మూగజీవాలు మరణిస్తుండటంతో పశువైద్యాధికారులు వైద్యశిబిరం నిర్వహించారు. సోమవారం గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు.

సీజేఐపై దాడి హేయమైన చర్య