భక్తజన సందోహం మల్లన్న ప్రాంగణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్నాలు వేసి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామివారి నిత్యాన్నదానానికి కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామానికి చెందిన భక్తులు రాపల్లి మహేశ్ దివ్య దంపతులు ఆలయ ఈఓకు రూ. 1,00,116లు విరాళంగా అందించారు. ఆలయ ఈఓ వెంక టేశ్, ఏఈఓ శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహా దేవుని మల్లికార్జున్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
పద్మశాలీ సంఘం
ఎన్నికలకు నోటిఫికేషన్
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలీ సంఘం ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక పద్మశాలీ ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు టి.రాజు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 7 నుంచి 8వ తేది సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, 11న ఎలక్షన్ కమిటీ సమావేశం, అదే రోజు అభ్యర్థుల ప్రకటన, 13న డమ్మీ బ్యాలెట్ పత్రాల విడుదల, 19న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు గెలిచిన అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలీ సంఘం నాయకులు రాజారామ్, రాజేశం, గాడిపల్లి శ్రీనివాస్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాడులు అమానుషం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
గజ్వేల్: దళితులపై దాడులు సహించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లిలో దాడికి గురై గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు మహిపాల్‌ను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన దాడికి గల కారణాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. పాత కక్షలు, భూతగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దాడులకు తెగబడటం సరికాదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోన్‌లో ఆదేశించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, దళిత ఉద్యోగుల వేదిక నాయకులు సత్యనారాయణ, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.
కొండపోచమ్మకు
ఎమ్మెల్యే గణేశ్ పూజలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని కొండపోచమ్మతల్లిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పండుగ తర్వాత ఆదివారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తజన సందోహం మల్లన్న ప్రాంగణం
భక్తజన సందోహం మల్లన్న ప్రాంగణం


