
ఏడుపాయల జనసంద్రం
50 రోజులుగా జలదిగ్బంధంలో దుర్గమ్మ
ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 50 రోజులుగా ఏడుపాయల మంజీరా వరదల్లో చిక్కుకుంది. ఆదివారం వరదలు తగ్గడంతో సిబ్బంది ఆలయంలోకి వెళ్లారు. భారీ స్థాయిలో వచ్చిన వరదలతో ప్రసాదం షెడ్డు కొట్టుకుపోయింది. గర్భగుడిలోని గ్రిల్స్, రేకులు, జాలీ ధ్వంసం కాగా, మండపంలోని గ్రానైట్ బండలు, టైల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. ఆలయ ప్రాంగణం మొత్తం పాకురుతో నిండిపోయింది. – పాపన్నపేట(మెదక్)

ఏడుపాయల జనసంద్రం