
పారదర్శకంగా వాహనాల తనిఖీలు
కలెక్టర్ హైమావతి
బెజ్జంకి(సిద్దిపేట): వాహనాలను అత్యంత పారదర్శకంగా తనిఖీ చేయాలని కలెక్టర్, ఎన్నికల ఇన్‌ఛార్జి హైమావతి సూచించారు. మండలంలోని తోటపల్లి శివారులో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ శిబిరాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం వాహనాల తనిఖీ నమోదు రిజిస్టర్‌ను పరిశీలించి తనిఖీ ప్రక్రియను వీడియో తీయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
వైద్య సిబ్బంది గైర్హాజర్‌పై ఆగ్రహం
బెజ్జంకితోపాటు పీహెచ్‌సీని కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ఈ సమయంలో స్టాఫ్‌నర్స్ పద్మ మినహా సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది వైఖరిపై డీఎంహెచ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడారు. తప్పనిసరిగా డ్యూటీలో ఉండేలా సూచించారు. విధుల నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేటి ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయనున్నట్లు కలెక్టర్ కె.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ ముగిసేంత వరకు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.