
గజ్వేల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కవాతు
గజ్వేల్‌రూరల్: ప్రతి ఒక్కరూ దేశ, దైవ భక్తిని కలిగి ఉండాలని, అలాగే.. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ మల్లికార్జున్ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహాఇంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోకి ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను తీసుకెళ్లాలని సూచించారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరముందని, అందరు విధిగా కుటుంబ విలువలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మంద సాయినాథ్‌రెడ్డి, సామాజిక సమస్త విధిగా ప్రాంత అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్‌బాబు పాల్గొన్నారు.