అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి

Oct 5 2025 8:50 AM | Updated on Oct 5 2025 8:50 AM

అమ్మవ

అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక: దుర్గామాత కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాకతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని పండుగలు ఘనంగా జరుపుకొనే మంచి సంస్కృతి ,సాంప్రదాయాలు తరాల నుంచి వస్తుందన్నారు. భక్తి భావంతో పాటు ప్రజలు ఐకమత్యంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఐక్యతతోనే

రాజ్యాధికారం సాధ్యం

జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి

గజ్వేల్‌రూరల్‌: బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. గజ్వేల్‌కు చెందిన యాదగిరి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సంద ర్భంగా గజ్వేల్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీల్లో ఐక్యత లోపించిన కారణంగానే రాజ్యాధికారానికి దూరమవుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత ఎంతో అవసరమన్నారు. వారిని చైతన్యం చే స్తూ సంఘటిత పోరాటం చేస్తామని పేర్కొన్నా రు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతిని పటిష్టం చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు.

మహిళల రక్షణే ప్రధాన కర్తవ్యం: సీపీ అనురాధ

సిద్దిపేటకమాన్‌: మహిళల రక్షణే షీటీమ్‌ ప్రధాన కర్తవ్యమని పోలీసు కమిషనర్‌ అనురాధ తెలిపారు. మహిళలు, బాలికల రక్షణకు ఉన్న చట్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో షీటీమ్‌ బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో షీటీమ్స్‌ గత నెలలో 49మంది ఈవ్‌ టీజర్లను పట్టుకొని కౌన్సెలింగ్‌ నిర్వహించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్‌ల వారీగా హాట్‌స్పాట్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేసి 53 ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ పేర్కొన్నారు. మహిళలను ఎవరైనా వేధిస్తే డయల్‌ 100 లేదా షీటీమ్‌ వాట్సప్‌ నంబర్‌ 8712667434కు ఫోన్‌ చేయాలని సూచించారు.

మద్యం షాప్‌లకు

మొదటి దరఖాస్తు

సిద్దిపేటకమాన్‌: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణ (2023–25)కు శనివారం మొదటి దరఖాస్తు వచ్చినట్లు ఎకై ్సజ్‌ ఈఎస్‌ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్‌ షాపుల నిర్వహణకు గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్‌ పోలీసు స్టేషన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈసారి దరఖాస్తుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. 23న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు.

జోరు తగ్గిన మంజీరా

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు.

అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి1
1/1

అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement