దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు
హుస్నాబాద్: పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలని గాంధీ అడుగు జాడల్లో మనమంతా నడవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీచౌక్‌లో గురువారం గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని, రాజ్యాంగం పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, నాయకులు బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు ఉన్నారు.
దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి
గురువారం మున్సిపాలిటి ఆధ్వర్యంలో శివాలయం వద్ద నిర్వహించిన శమీ పూజలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద దసరా సందర్బంగా రామ్ లీలా కార్యక్రమంలో పాల్గొని మంత్రి రావణ దహనం చేశారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్ పర్సన్ అనిత తదితరులు ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


