రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

Oct 4 2025 6:17 AM | Updated on Oct 4 2025 6:17 AM

రేపు

రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

ప్రశాంత్‌నగర్‌(సిద్ధిపేట): సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 5న ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగనున్నట్లు, జిల్లా అధ్యక్షుడు అమ్మన చంద్రారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక, మండలాల ఎన్నికలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

గాంధేయ మార్గాన్ని

అనుసరించాలి

అదనపు డీసీపీ కుశాల్కర్‌

సిద్దిపేటకమాన్‌: మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలని అదనపు డీసీపీ అడ్మిన్‌ సీహెచ్‌ కుశాల్కర్‌ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పోలీసు కమిషనరేట్‌లో గాంధీ చిత్ర పటానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినపుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ సాయిప్రసాద్‌, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అందరికీ విజయాలను

అందించాలి

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

గజ్వేల్‌: దసరా అందరి జీవితాల్లో విజయాలను అందించాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి ఆకాంక్షించారు. గజ్వేల్‌ పట్టణంలోని డీసీఎంఎస్‌ గోదాము వద్ద గురువారం మున్సిపల్‌ తాజా మాజీ కౌన్సిలర్‌ గుంటుకు శీరీష రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలపిట్టను ఎగురవేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ చెడుపై మంచి విజయంగా చెప్పుకునే దసరా పండుగ అందరికీ మేలు చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, భరత్‌నగర్‌ కాలనీ వాసులు పాల్గొన్నారు.

సీపీఎం అభ్యర్థులను

గెలిపించాలి: చుక్కా రాములు

సిద్దిపేటఅర్బన్‌: నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే సీపీఎం అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కార్మిక కర్షక భవన్‌లో గురువారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో పాలకులు లేక సమస్యలతో ప్రజలు విసిగిపోతున్నారని, వారికి అండగా నిలుస్తున్న పార్టీ సీపీఎం అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు శశిధర్‌, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పండగ పూట నీటిగోస

కౌడిపల్లి(నర్సాపూర్‌): పండుగ పూట నీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈసంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. కౌడిపల్లిలో మూడు రోజులుగా మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీరు లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఓవైపు భగీరథ నీరు రాక, మరోవైపు గ్రామంలో బోరుబావులు సరిగా లేకపోవడంతో కొత్తకాలనీకి చెందిన పలువురు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్‌ ద్వారా సరఫరా చేస్తామని చెప్పడంతో విరమించారు.

రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు1
1/2

రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు2
2/2

రేపు ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement