దసరాకు కిక్కెంచారు
● రూ.20కోట్ల మద్యం విక్రయాలు ● వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో ఎకై ్సజ్‌కు భారీ ఆదాయం
ముందుగానే కొనుగోళ్లు
ఈ ఏడాది దసరా పండుగకు మూడు రోజుల్లో జిల్లాలో రూ.20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఆఖరి వారంలో ప్రారంభం కావడం వరుస దసరా సెలవులు రావడంతో మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. దసరా రోజునే గాంధీ జయంతి కూడా రావడంతో ఒకరోజు ముందుగానే మద్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి.
– శ్రీనివాసమూర్తి, సిద్దిపేట,
ఎకై ్సజ్ సూపరింటెండెంట్
సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా వరుస సెలవుల నేపథ్యంలో మందుబాబులు తెగ తాగేశారు. దసరా పండగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో మద్యం దుకాణాలు మూసి వేసినప్పటికీ ఒక రోజు ముందే మద్యం ప్రియులు మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా గత నెల 29, 30, ఈ నెల 1వ తేదీల్లో రూ. 20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది తో చూస్తే ఈ దసరా పండగా ముందుగా సెప్టెంబర్ నెలాఖరు నుంచే సేల్ ప్రారంభం కావడంతో అదే నెలలో సేల్ వివరాలు నమోదయ్యాయి. జిల్లా ప్రజలు దసరా పండగను రెండు రోజులు మందు, మాంసంతో విందులు జరుపుకున్నారు.
మూడు రోజుల్లో రూ.20కోట్ల విక్రయాలు
జిల్లాలోని 93 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా దసరా పండగకు మూడు రోజుల్లో రూ.20కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో గత నెల 29న 6,907 లిక్కర్ బాక్సులు, 10,445 బీర్ బాక్సులు, 30న 7,632 బాక్సుల లిక్కర్, 9,796 బాక్సుల బీర్లు, ఈ నెల 1న 3,761 బాక్సుల లిక్కర్, 9,686 బాక్సుల బీర్లు విక్రయించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో మద్యం దుకాణాలు మూసి వేసినప్పటికీ ఒక రోజు ముందుగానే అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో చూస్తే ఈ ఏడాది అధికంగా మద్యం విక్రయాలు జరిగి ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు.


