గాంధీ మార్గంలో నడుద్దాం
దుబ్బాక: జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దామని ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం దుబ్బాక పట్టణంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు గాంధీ అని ఆయన స్ఫూర్తితో దేశరక్షణకు పాటుపడుదామన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.
ఘనంగా దసరా ఉత్సవాలు
దుబ్బాక మండలంలో దసరా ఉత్సవాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రఘునందన్‌రావు తన స్వగ్రామం బొప్పాపూర్‌లో, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన స్వగ్రామం పోతారంలో తమ కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి దసరా సంబరాల్లో పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ హైమావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీ, కలెక్టరేట్ ఏఓ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు
గాంధీ మార్గంలో నడుద్దాం


