
సామాజిక సేవకు నిలయంగా సిద్దిపేట
అమర్‌నాథ్ సేవా సమితి భవన
భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/సిద్దిపేటజోన్: సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక సేవ, అన్నదానాలు, వివిధ సేవా కార్యక్రమాలకు నిలయంగా సిద్దిపేట నిలుస్తోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం అమర్‌నాథ్ సేవా సమితి భవనం భూమి పూజ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట నుంచి ప్రారంభమైన అన్నదానం అమర్‌నాథ్, అయోధ్య, కేదారినాథ్ వరకు సాగుతోందన్నారు. అమర్‌నాఽథ్ అన్నదాన సేవా సమితికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
గాంధీ ఆశయసాధనకు కృషి చేయాలి
గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అహింసామార్గంలో శాంతియుతంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సింహ, సుడా మాజీ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.