
పేదలకోసమే పరితపించిన రామలింగారెడ్డి
● నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా సాధారణ జీవితమే ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ,ఎస్టీ చైర్మన్ వెంకటయ్య
దుబ్బాక/దుబ్బాకటౌన్: తుదిశ్వాస విడిచేంత వరకు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేదల కోసమే పరితపించారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం చిట్టాపూర్‌తోపాటు దుబ్బాకలో ఆయన విగ్రహాలకు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బక్కి వెంకటయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా రామలింగారెడ్డి అత్యంత సాధారణ జీవితమే గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన భౌతికంగా లేకున్నా పేదప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలచిపోయాడని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, రామలింగారెడ్డి కుమారుడు సతీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు రాజమౌళి, ఎల్లారెడ్డి తదితరులున్నారు.
దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
దుబ్బాక పట్ణణంలో రెడ్డిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన లైటింగ్, డీజే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ, యువకుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.