
గజ్వేల్‌లో నేడు సద్దుల బతుకమ్మ
ఏర్పాట్లను పరిశీలించినఏసీపీ, మున్సిపల్ కమిషనర్
గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ ఊరచెరువు వద్ద స్థానిక ఏసీపీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా చెరువుల వద్ద అవసరమైన బారీకేడ్లు, లైటింగ్, వేదిక ఏర్పాటు తదితర అంశాలపై కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలోనే వాహనాలు నిలిపేలా చూడాలని పోలీసులకు ఆదేశాలివ్వనున్నట్లు ఏసీపీ తెలిపారు. రోడ్డుపై రద్దీ ఉండే అవకాశమున్నందువల్ల స్టాపర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎలాంటి ఈవ్‌టీజింగ్ జగరకుండా మఫ్టీలో పోలీసుల నిఘా కొనసాగుతోందన్నారు. అలాగే దసరా పండుగ రోజు మహంకాళీ ఆలయం వద్ద నిర్వహించనున్న రావణ దహనం, ఇతర ఏర్పాట్లను సైతం ఏసీపీ పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.